తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యేకు నీటికొరత సెగ.. బిందెలతో మహిళల దండయాత్ర - PROTEST TO SOLVE DRINKING WATER PROBLEM

తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ... ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ క్యాంపు కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో మహిళలు నిరసన తెలిపారు. మున్సిపల్​ సిబ్బంది నిర్లక్ష్యం చూపుతున్నారని మండిపడ్డారు.

WOMEN PROTESTED WITH EMPTY POTS IN FRONT OF MLA SUNKE RAVI SHANKER HOUSE
WOMEN PROTESTED WITH EMPTY POTS IN FRONT OF MLA SUNKE RAVI SHANKER HOUSE

By

Published : Mar 10, 2020, 12:32 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ క్యాంపు కార్యాలయంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తాగునీటి విషయంలో ఒకటో వార్డు పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని వాపోయారు. తాగునీటి సరఫరా సమస్యపై మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం చూపుతున్నారని మండిపడ్డారు.

ఎన్నికల సమయంలో హామీలిచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. మురుగునీటి కాలువల్లో చెత్త తొలగించటంలేదని, విద్యుత్తు సమస్యలు పరిష్కరించటంలేదని ఆరోపించారు. మహిళలకు నచ్చజెప్పి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ శాంతింపజేశారు. స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని హామీనిచ్చారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట మహిళల ఆందోళన

ఇదీ చూడండి:ఆ కలెక్టరు పేరు చెబితే అధికారులు హడలిపోతున్నారు

ABOUT THE AUTHOR

...view details