కరీంనగర్ జిల్లా గంగాధరలో బతుకమ్మ చీరల పంపిణీలో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసేందుకు సిద్ధపడగా వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యతలేని చీరలు ఎందుకు పంపిణీ చేస్తున్నారని ప్రశ్నించారు. దీనితో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
బతుకమ్మ చీరలపై ఆడపడుచుల పెదవి విరుపు - బతుకమ్మ చీరల పంపిణీ తాజావార్తలు
బతుకమ్మ పండుగకు ఆడపడుచులందరూ కొత్త చీరలు కట్టుకోవాలని, సంతోషంగా పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘బతుకమ్మ చీరల’ పంపిణీ కార్యక్రమం.. మహిళల నిరసనలకు దారితీసింది. తమకు ఏమాత్రం నాణ్యత లేని, నాసిరకం చీరలు పంపిణీ చేస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌ను ప్రశ్నించారు.

బతుకమ్మ చీరలపై ఆడపడుచుల పెదవి విరుపు
ఖరీదైన చీరలు సొంతంగా కొనుగోలు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరలు నచ్చని వారు పేదలకు అందజేయాలన్నారు. చివరగా మండల పరిషత్‌కు చేరుకున్న మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశారు.
బతుకమ్మ చీరలపై ఆడపడుచుల పెదవి విరుపు
TAGGED:
బతుకమ్మ చీరల పంపిణీ