కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్ల నరసింహులపల్లి గ్రామానికి చెందిన మమత అనే యువతి ప్రేమ పేరుతో మోసపోయానని మౌనదీక్ష చేస్తోంది. పత్తికుంటపల్లి గ్రామ యువకుడు చంద్రమౌళి గత ఐదేళ్లుగా ప్రేమించి పెళ్లికి నిరాకరించాడని యువతి చెబుతోంది. కొన్ని రోజుల క్రితం ఇరుపక్షాల పెద్దలు నిశ్చితార్థం చేశారు. ఇప్పుడు సొంత గ్రామం నుంచే ఉడాయించాడని అతని ఇంటి ముందు గత రెండు రోజులుగా మౌన దీక్ష చేపట్టింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది.
ముఖం చాటేసిన ప్రియుడు.. నిశ్చితార్థం తర్వాత పరారీ - woman protest at boyfriend house who betrayed her in karimnagar
ఆమె.. అతన్ని ఐదేళ్లుగా ప్రేమించింది. ఇరు పక్షాలను పెళ్లికి ఒప్పించింది. చివరికి నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి పేరెత్తగానే వాయిదా వేస్తూ వచ్చాడు ప్రియుడు. చివరికి అతని సొంతూరు విడిచి పరారయ్యాడు. తనకు న్యాయం చేయాలంటూ ఆమె ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్ష చేపట్టింది.
![ముఖం చాటేసిన ప్రియుడు.. నిశ్చితార్థం తర్వాత పరారీ ముఖం చాటేసిన ప్రియుడు.. నిశ్చితార్ధం తర్వాత పరారీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5877264-842-5877264-1580233281981.jpg)
ముఖం చాటేసిన ప్రియుడు.. నిశ్చితార్ధం తర్వాత పరారీ
ముఖం చాటేసిన ప్రియుడు.. నిశ్చితార్థం తర్వాత పరారీ
ఇదీ చూడండి : ప్రేమ పెళ్లి.. 10 రోజులకే వివాహిత అనుమానాస్పద మృతి
TAGGED:
యువతి మౌన దీక్ష