తెలంగాణ

telangana

ETV Bharat / state

చొప్పదండిని అభివృద్ధి చేస్తాం.. మాకే ఓటేయండి: బొడిగె శోభ - BJP_PRACHARAM

కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి పురపాలికలో భాజపాను గెలిపిస్తే పట్టణ అభివృద్ధి చేస్తామని మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ అన్నారు. ఈ మేరకు ఎంపీ బండి సంజయ్ సహకారంతో పనులు చేస్తామని హామీ ఇచ్చారు.

సంక్షేమం కోసం భాజపా అభ్యర్థులనే గెలిపించండి : బొడిగె శోభ
సంక్షేమం కోసం భాజపా అభ్యర్థులనే గెలిపించండి : బొడిగె శోభ

By

Published : Jan 17, 2020, 7:56 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండిలో భాజపా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పుర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. రాష్ట్రంలో తెరాస పరిపాలన అవాస్తవ ప్రచారాలతో సాగుతోందని మండిపడ్డారు. ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ మాటమార్చారని ఎద్దేవా చేశారు.

దేశం భాజపా వైపు దృష్టి సారించిందని అన్నారు. కరీంనగర్ లోక్​సభ సభ్యుడు బండి సంజయ్ సహకారంతో చొప్పదండిలో అభివృద్ధి సాధిస్తామని పేర్కొన్నారు. చొప్పదండి పట్టణ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సంక్షేమం కోసం భాజపా అభ్యర్థులనే గెలిపించండి : బొడిగె శోభ

ఇవీ చూడండి : బూటకపు వాగ్దానాలు నమ్మొద్దు.. తెరాసకు షాక్ ఇద్దాం : ఉత్తమ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details