తెలంగాణ

telangana

ETV Bharat / state

హుషారెత్తించిన స్వాగతోత్సవ వేడుకలు - హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌ కిట్స్‌ యంత్ర కళాశాలలో స్వాగతోత్సవ వేడుకలు

హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌ కిట్స్‌ యంత్ర కళాశాలలో స్వాగతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థుల కేరింతల నడుమ వేడుకలు అంబరాన్నంటాయి.

హుషారెత్తించిన స్వాగతోత్సవ వేడుకలు

By

Published : Nov 10, 2019, 9:38 AM IST

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌ కిట్స్‌ యంత్ర కళాశాలలో ఈఈఈ, ఈసీఈ విభాగాల ఆధ్వర్యంలో నూతన విద్యార్థులకు సినీయర్‌ విద్యార్థులు స్వాగతోత్సవ వేడుకలు నిర్వహించారు.

ఈ వేడుకలను కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కందుకూరి శంకర్ ప్రారంభించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. సినిమా పాటలకు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

హుషారెత్తించిన స్వాగతోత్సవ వేడుకలు

ఇదీ చూడండి : అన్నదాత ఆత్మహత్యల్లో తెలంగాణకు ఆరో స్థానం

ABOUT THE AUTHOR

...view details