కరీంనగర్ నగర పాలక సంస్థలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరలోనే పూర్తి చేస్తామని మేయర్ వై.సునీల్ రావు పేర్కొన్నారు. నగరంలోని 40వ డివిజన్లో ప్రధాన కూడలి వద్ద కార్పొరేటర్ భూమ గౌడ్ ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను కాలనీ వాసులతో కలిసి ఆయన ప్రారంభించారు.
పెండింగ్ పనులను త్వరలోనే పూర్తి చేస్తాం: మేయర్ సునీల్‌రావు - We will complete the pending works soon: Mayor Sunil Rao
కరీంనగర్లో అన్ని అభివృద్ధి పనులను త్వరలోనే పూర్తి చేసి స్మార్ట్‌సిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మేయర్ సునీల్‌రావు పేర్కొన్నారు. 40 వ వార్డు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ఆయన ప్రారంభించారు
పెండింగ్ పనులను త్వరలోనే పూర్తి చేస్తాం: మేయర్ సునీల్‌రావు
నగరంలోని అన్ని కూడళ్ల వద్ద వీధి దీపాలను ఏర్పాటు చేస్తామని మేయర్ పేర్కొ న్నారు. ప్రజలు పరిశుభ్రతను పాటిస్తూ కరోనా నుంచి ముప్పు వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఇదీచూడండి.. దేశం గర్వించే గొప్ప నేత.. ప్రణబ్ ముఖర్జీ: భట్టి విక్రమార్క