పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ త్యాగాలను స్మరించుకుని.. ప్రతి ఒక్క విద్యార్థి ఆయన అడుగుజాడల్లో నడవాలని ఎంపీ బండి సంజయ్ సూచించారు. పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో విద్యార్థులకు ఎంపీ పండ్లు పంపిణీ చేశారు. రేకుర్తిలోని ప్రభుత్వ అంధ, మూగ, చెవిటి ఆశ్రమ పాఠశాలను ఎంపీ సందర్శించారు. పండిట్ దీన్దయాల్ ఆశయాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన నిధులను అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థులు తమ అంగవైకల్యాన్ని మర్చిపోయి సాధారణ విద్యార్థులతో పోటీ పడాలని ప్రోత్సహించారు.
దీన్దయాల్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం - mp
పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ ఆశయాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో విద్యార్థులకు ఆయన పండ్లు పంపిణీ చేశారు.
దీన్దయాల్