కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో నీరు అడుగంటడంతో కాళేశ్వరం (Kaleshwaram) జలాలను ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభమైంది. కాళేశ్వరం (Kaleshwaram) ఎత్తిపోతల పథకం కింద ఎగువకు గోదావరి జలాల ఎత్తిపోసే ప్రక్రియ రెండు రోజుల కిందట ప్రారంభం కాగా మరింత ఉద్ధృతమైంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో నీటిపారుదలశాఖ అధికారులు నంది మేడారం(Nandi Medaram)లోని ఆరో ప్యాకేజీ పంపుహౌస్‌లో రెండు మోటార్లతో ఎత్తిపోతలు ప్రారంభించారు. ఇవాళ మరో మోటార్ ద్వారా నీటిని ఎత్తిపోసే ప్రక్రియను చేపట్టారు. ఎల్లంపల్లి జలాశయం నుంచి ఒక్కో మోటార్ ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున 9,450 క్యూసెక్కుల గోదావరి జలాలు నందిమేడారం రిజర్వాయర్‌లోకి చేరుతున్నాయి.