కరీంనగర్ జిల్లా గర్షకుర్తి గ్రామంలో వర్షపు నీటి సంరక్షణకు చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ జలశక్తి అభియాన్ అధికారులు పరిశీలించారు. ఇంటింటికి ఇంకుడు గుంతలు, గ్రామం వెలుపల ఊట కుంటల నిర్మాణం, బావుల్లో నీటి లభ్యత పెంచడానికి చేపట్టిన పనులను గురించి అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో నీటి కొరత లేకుండా ఇప్పటి నుంచే భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి కుటుంబం తమ ఇళ్ల వద్ద స్వచ్ఛందంగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కోరారు. కేంద్ర ప్రభుత్వ బృందం అధికారులు సతిందర్ పాల్, ఉమ్రావ్ సింగ్, సౌరభ్ శరణ్ పాల్గొన్నారు.
గర్షకుర్తిలో జలశక్తి అభియాన్ సభ్యుల పర్యటన - water safety group visit
కరీంనగర్ జిల్లాలో జలసంరక్షణ పనులను జలశక్తి అభియాన్ బృందం సభ్యులు పరిశీలించారు. నీటి సంరక్షణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

గర్షకుర్తిలో జలశక్తి అభియాన్ సభ్యుల పర్యటన
గర్షకుర్తిలో జలశక్తి అభియాన్ సభ్యుల పర్యటన
ఇదీ చదవండిః ప్రశాంతంగా డీసెట్ రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన
TAGGED:
water safety group visit