కరీంనగర్ కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాల ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. పంచాయతీ బోర్డులు మారినా తాగునీటి కష్టాలు మాత్రం వీడడం లేదు. మరోవైపు మిషన్ భగీరథ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నగరంలో గ్రామాలు కలిసిన తర్వాత నీటి సరఫరా అరకొరగానే సాగుతోంది.
తప్పని తాగునీటి కష్టాలు
రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన మిషన్‌భగీరథ పథకం కరీంనగర్ కార్పొరేషన్ విలీన ప్రాంతాల్లో నత్తనడకన సాగుతోంది. రెండున్నరఏళ్ల క్రితం గ్రామాల్ని నగరపాలక సంస్థలో విలీనం చేశారు. ఐతే గ్రామాల్లో బోర్డులు మారడం తప్ప సేవల్లో మాత్రం ఎలాంటి మార్పులేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తన్నారు. అసంపూర్తిగా పైపులైన్లు, ట్యాంకులు నిర్మించినా సాంకేతిక సమస్యలతో పూర్తిస్థాయిలో నీటి సరఫరా జరగట్లేదు. తీగలగుట్టపల్లి, సరస్వతీనగర్, హనుమాన్‌నగర్, రామాలయం వైపు ఇంటర్ కనెక్షన్లు, గేట్ వాల్వులు బిగించకపోవడంతో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు.