ముస్లిం దేశస్తులైనా అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్లలో అణచివేతకు గురైన అల్పసంఖ్యాక వర్గాలకు, హిందువులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లు శరణార్థులుగా భారతదేశానికి వచ్చిన వారికి పౌరసత్వ సవరణ చట్టం ద్వారా పౌరసత్వం లభిస్తుందని విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి రాజేందర్ రెడ్డి అన్నారు.
'ఇక్కడే పుట్టిన ముస్లింలకు అభద్రత వద్దు' - 'ఇక్కడే పుట్టిన ముస్లింలకు అభద్రత వద్దు'
కుల, మత, ప్రాంత, వర్గాల తేడా లేకుండా అందరూ కలిసి జీవించే విధంగా భారతదేశం ఉందని విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి రాజేందర్ రెడ్డి అన్నారు. ముస్లిం దేశస్థులైనా.. ఏ ప్రాంత వర్గాల వారైనా శరణార్థులుగా భారతదేశం వచ్చిన వారికి పౌరసత్వ సవరణ చట్టం ద్వారా భారతదేశ పౌరసత్వం లభిస్తుందని కరీంనగర్లో ఆయన అన్నారు.
!['ఇక్కడే పుట్టిన ముస్లింలకు అభద్రత వద్దు' viswa hindhu parishath talks on CAA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5459819-628-5459819-1577022413074.jpg)
'ఇక్కడే పుట్టిన ముస్లింలకు అభద్రత వద్దు'
కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు అనవసరపు రాద్ధాంతాలు చేస్తున్నాయని కరీంనగర్లో ఆయన ఆరోపించారు. బిల్లుపై అసత్య ప్రచారం చేస్తూ ముస్లిం సోదరులను అభద్రతకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. భారతీయ మూలమంత్రం భిన్నత్వంలో ఏకత్వంలా.. భాషా, ప్రాంత, కుల, మత భేదాల లేకుండా అందరూ కలిసి జీవించే విధంగా భారతదేశం ఉందన్నారు.
'ఇక్కడే పుట్టిన ముస్లింలకు అభద్రత వద్దు'
ఇవీచూడండి: అక్కడ నీది నాది ఒకటే నినాదం.. ఇంటికి వంద-బడికి చందా