తెలంగాణ

telangana

ETV Bharat / state

'నాణ్యమైన విత్తనాలతో ఆకర్షణీయమైన దిగుబడి' - karimnagar district news

కరీంనగర్​ జిల్లా వెదిరలో పత్తి పంట క్షేత్రాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ సందర్శించారు. రైతులతో కాసేపు ముచ్చటించారు. రైతులకు లాభం చేకూర్చేందుకే నియంత్రిత సాగు వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి తీసుకొచ్చారని తెలిపారు.

vinodkumar and mla ravishankar visit cotton crop field in karimnagar district
పత్తి పంట క్షేత్రాన్ని సందర్శించిన వినోద్ కుమార్, ఎమ్మెల్యే రవిశంకర్

By

Published : Jun 10, 2020, 8:54 PM IST

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరలో పత్తి పంట క్షేత్రాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ సందర్శించారు. పంట మార్పిడి విధానం అనుసరిస్తున్నారా? అని రైతును అడిగారు. గతంలో వరి సాగు చేశామని ఈ సారి పత్తి సాగు చేస్తున్నట్టు రైతు వివరించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సరైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని వినోద్ కుమార్ సూచించారు. కూలీలతో మాట్లాడుతూ ఎంత మేరకు కూలి లభిస్తుందని అడిగి తెలుసుకున్నారు. రైతులకు లాభం చేకూర్చేందుకే నియంత్రిత సాగు విధానాన్ని ముఖ్యమంత్రి తీసుకొచ్చారని వినోద్​కుమార్​ అన్నారు.

ఒకే రకమైన పంటను వరుసగా వేయడం వల్ల అనేక ఇబ్బందులు ఉంటున్నట్లు రైతులు వెల్లడించారు. వరి పంట మాత్రమే కాకుండా పత్తి , పెసర, కూరగాయ పంటలు, కంది సాగు చేస్తున్నామని తెలిపారు. ఈ పర్యటనలో జడ్పీ మాజీ ఛైర్మన్ తుల ఉమ కూడా పాల్గొన్నారు.

ఇవీ చూడండి: చర్చలు సఫలం.. ఆ ఐదు డిమాండ్లకు మంత్రి సానుకూలం

ABOUT THE AUTHOR

...view details