'ప్రైవేట్ పాఠశాలలు వద్దు.. ప్రభుత్వ బడులే ముద్దు' అనే నినాదంతో కరీంనగర్ జిల్లా ఆముదాలపల్లి, అన్నారం గ్రామాల్లోని ప్రైవేట్ స్కూల్ బస్సులను ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు అడ్డుకున్నారు. అన్నారంలో దాదాపు 16 బస్సులను అడ్డుకుని ఆందోళన చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు గొడవ చేశారు.
ప్రైవేట్ స్కూల్ బస్సులను అడ్డుకున్న గ్రామస్థులు - ప్రైవేట్ పాఠశాలల బస్సులను అడ్డుకున్న గ్రామస్థులు
కరీంనగర్ జిల్లా ఆముదాలపల్లి, అన్నారం గ్రామాల్లో 'ప్రైవేట్ పాఠశాలలు వద్దు... ప్రభుత్వ బడులే ముద్దు' అనే నినాదంతో ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు ప్రైవేట్ స్కూల్ బస్సులను అడ్డుకున్నారు.
![ప్రైవేట్ స్కూల్ బస్సులను అడ్డుకున్న గ్రామస్థులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3672303-thumbnail-3x2-vysh.jpg)
ప్రైవేట్ పాఠశాలల బస్సులను అడ్డుకున్న గ్రామస్థులు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేందుకు నిరాకరిస్తే ... ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తీసుకోబోమని తల్లిదండ్రులు రాసివ్వాలని డిమాండ్ చేశారు. ఫలాలు కావాలంటే ప్రభుత్వ బడులను ప్రోత్సాహించాలన్నారు. ఈ మేరకు బస్సుల్లోని పిల్లలందరినీ దింపి ఖాళీ బస్సులను పంపించారు. మరోసారి గ్రామంలోకి రాకూడదని డ్రైవర్లను హెచ్చరించారు.
ప్రైవేట్ పాఠశాలల బస్సులను అడ్డుకున్న గ్రామస్థులు
ఇదీ చదవండిః చెన్నై నీటి సమస్యపై స్పందించిన టైటానిక్ హీరో