తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకోండి' - chokkaraopally villagers protest

ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చొక్కారావుపల్లి గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అధికారులు స్పష్టత ఇచ్చే వరకు కదిలే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చున్నారు.

'ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకోండి'
'ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకోండి'

By

Published : Dec 12, 2020, 4:19 PM IST

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చొక్కారావుపల్లి గ్రామస్థులు ఆందోళనకు దిగారు. గ్రామ శివారులోని బిక్కవాగులో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరుకు చెందిన కొందరు... కొంత కాలంగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని గన్నేరువరం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. రాత్రి పూట గ్రామస్థులతో కలిసి ఎస్సై తిరుపతి ఘటనా స్థలిలో దాడి చేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న పలువురు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా... గ్రామస్థుల ద్విచక్ర వాహనాలు, కార్లను ధ్వంసం చేసి నిందితులు ట్రాక్టర్లతో పారిపోయారు.

ధ్వంసమైన వాహనాలను పరిశీలిస్తున్న ఏసీపీ

రాత్రి వేళల్లో పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారని గ్రామస్థులు మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ సిద్ధం వేణు, పొత్తూరు సర్పంచ్​... ఈ తంతులో కీలక భూమిక పోషిస్తున్నారని ఆరోపించారు. నిలదీస్తే.. దాడులకు పాల్పడుతున్నారని వాపోయారు. అధికారులు స్పష్టత ఇచ్చే వరకు కదిలే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న కరీంనగర్ ఏసీపీ విజయ సారథి, సీఐ మహేశ్​ గౌడ్​తో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుని... పునరావృతం కాకుండా చూస్తామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.

గ్రామస్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటూ...

ఇదీ చూడండి: 'రాష్ట్రంలో డొమెస్టిక్​ ఎయిర్​పోర్టుల అభివృద్ధికి చర్యలు తీసుకోండి'

ABOUT THE AUTHOR

...view details