తెలంగాణ

telangana

ETV Bharat / state

చెరువు కట్టపై వరినాట్లు వేసి స్థానికుల నిరసన - karimnagar news

చెరువు మరమ్మతు చేపట్టటం లేదని కరీంనగర్​ జిల్లా చొప్పదండిలో స్థానికులు వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. చెరువు కట్టపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. చెరువు అభివృద్ధికి నిధులు మంజూరు చేసినా... పనులు చేపట్టటం లేదని ఆరోపించారు.

villagers protest for pond development in choppadhandi
villagers protest for pond development in choppadhandi

By

Published : Jul 25, 2020, 3:31 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణం శివారులోని కుడి చెరువు మరమ్మతు చేపట్టడం లేదని స్థానికులు ఆందోళన చేశారు. కుడి చెరువు కట్టపై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. గతంలో మినీ ట్యాంక్​బండ్​ ప్రతిపాదించి చేతులు దులుపుకున్నారని వాపోయారు.

తాజాగా కుడి చెరువు అభివృద్ధికి నిధులు మంజూరు చేసినా... పనులు చేపట్టటం లేదని ఆరోపించారు. కుడి చెరువు కట్టపై సిమెంట్ రహదారి నిర్మించాల్సి ఉందన్నారు. చిన్నపాటి వర్షానికే... కట్ట మొత్తం బురదమయంగా మారుతోందన్నారు. రకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రజాప్రతినిధులు సైతం చూసి చూడనట్లు వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పంధించి చెరువు కట్ట మరమ్మతులు చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండిఃకొవిడ్‌ బాధితులకు పరీక్షల నుంచి చికిత్సల వరకు అడ్డంకులే

ABOUT THE AUTHOR

...view details