కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండపల్లిలో కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ కాలువ భూసేకరణను గ్రామస్థులు బహిష్కరించారు. గ్రామసభకు హాజరైన అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎకరానికి కోటి రూపాయల పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పరిహారం ప్రకటించనంతవరకు సర్వే చేపట్టవద్దని నిరసన తెలిపారు.
'భూసేకరణను బహిష్కరించాం. వరి వేస్తే ఉరి అని చెబుతున్న ప్రభుత్వం మూడో టీఎంసీని ఏ రైతులకు మేలు చేయడం కోసం తీసుకెళ్తున్నారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. భూమిల్ని గుంచేసుకుంటాం.. చట్టం ప్రకారం పరిహారం ఇస్తామంటున్నారు. ఎంతో విలువైన భూములను ఎకరాకు 9 లక్షలకు గుంజుకోవాలని చూస్తే ప్రజాపోరాటం చేస్తాం.' - ఉప్పు లింగయ్య, రైతు