కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. నియోజకవర్గ పరిధిలోని హుజూరాబాద్, జమ్మికుంట మండలాల్లోని విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో అధికారులు తనిఖీలు చేశారు. బృందాలుగా ఏర్పడి దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఎరువులు, విత్తనాల నిల్వలు, రిజిష్టర్లను తనిఖీ చేశారు. దుకాణ యజమానుల నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టాక్ నిల్వలను ఎప్పటికప్పుడు రిజిష్టర్లలో నమోదు చేయాలని ఆదేశించారు.
హుజూరాబాద్‌లో విజిలెన్స్ తనిఖీలు - విజిలెన్స్ అధికారుల దాడి
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట, మండలాల్లోని ఎరువులు, విత్తనాల దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు.

హుజూరాబాద్‌లో విజిలెన్స్ తనిఖీలు
రైతులకు ఎరువులు మాత్రమే అందించాలని.. విత్తనాలు అమ్మరాదని సూచించారు. ప్రభుత్వం ధృవీకరించిన విత్తనాలు మాత్రమే అమ్మాలని ఆదేశించారు. వానకాలం పంట సీజన్ ప్రారంభం కానుండడం వల్ల ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అధికారులు తనిఖీలకు వస్తున్నారని సమాచారం అందుకున్న కొందరు యజమానులు దుకాణాలకు తాళాలు వేసి వెళ్లిపోయారు.
ఇవీ చూడండి:తెలంగాణపై కరోనా పంజా... నిన్న ఒక్కరోజే 169 కేసులు