కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ పేద ప్రజలకు ఉపయోగపడేవిధంగా లేదని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ వరుసగా ప్రకటిస్తున్న ప్యాకేజీలు బడ్జెట్ను తలపిస్తున్నాయని మండిపడ్డారు.
"ప్రజలు తిరగని సమయంలో విమానాశ్రయాల అభివృద్ధికి నిధులు ప్రకటించడం ఏంటి? విమానరంగంలో సంస్కరణల వల్ల పేదలకు ప్రయోజనం ఉంటుందా? కేంద్రం ప్రకటిస్తున్న ప్యాకేజీల్లో సామాన్యులకు ఉపయోగపడే అంశం ఒక్కటీ లేదు. ఆర్థిక సంస్కరణలకు ఇది సమయం కాదు."