కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో దశాబ్దాలుగా శిథిలావస్థలో ఉన్న శ్రీవేణుగోపాలస్వామి ఆలయాన్ని ఇటీవలే పునరుద్ధరించారు. రుక్మిణిదేవి, గోదాదేవి సహిత శ్రీ వేణుగోపాలస్వామి ఉత్సవ మూర్తుల ప్రతిష్టాపన మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం స్వామి వారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. వేదపండితులు నమిలికొండ రమణాచార్య ఆధ్వర్యంలో కల్యాణోత్సవం నిర్వహించి భక్తులకు ఉపదేశం చేశారు. తీర్థ ప్రసాదాలు వితరణ చేసి.. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
రామడుగులో వేణగోపాలస్వామి ఆలయ పునరుద్ధరణ - కరీంనగర్ వార్తలు
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో శిథిలావస్థలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయాన్ని పునరుద్ధరించారు. విగ్రహ మూర్తులను ప్రతిష్టించి.. స్వామివారి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.
రామడుగులో వేణగోపాలస్వామి ఆలయ పునరుద్ధరణ