ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సీతారామకల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయంలో సీతారాముల విగ్రహాలకు పంచ ఉపనిషత్తు ద్వారా అభిషేకం, శ్రీ రాజరాజేశ్వర స్వామి వార్లకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తున్నారు.
తలంబ్రాలు సమర్పించనున్న హిజ్రాలు
కల్యాణ వేడుక వీక్షించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ధర్మ గుండంలో స్నానం చేసిన అనంతరం ఆలయంలో దర్శనం చేసుకుంటున్నారు. రద్దీ పెరిగి ఆలయ ఛైర్మన్ అతిథి గృహం ముందు ఏర్పాటుచేసిన వేదిక వద్ద గ్యాలరీలన్నీ నిండిపోయాయి.
కల్యాణం సందర్భంగా పట్టణ పురపాలక సంఘం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హిజ్రాలు హాజరై... తలంబ్రాలు తీసుకురానున్నారు.
అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.
భక్తజన సంద్రమైన వేములవాడ ఆలయం - vemulavwada
పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం సీతారాముల కల్యాణానికి ముస్తాబైంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణాలన్నీ కిక్కిరిసిపోయాయి.
రాముని కల్యాణాని వేములవాడ సిద్ధం
ఇవీ చూడండి: సీతారాముల కల్యాణానికి ముస్తాబవుతోన్న భద్రాద్రి
Last Updated : Apr 13, 2019, 4:14 PM IST