తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్పొరేటర్​ దాతృత్వం.. కూరగాయల పంపిణీ

లాక్​డౌన్​ కారణంగా పూటగడవక తీవ్ర అవస్థలు పడుతున్న నిరుపేద కుటుంబాలకు కరీంనగర్​ 15వ వార్డు కార్పొరేటర్ కూరగాయలను పంపిణీ చేశారు. లాక్​డౌన్​ పూర్తయ్యేవరకు​ పేదలకు తన వంతు సాయం చేస్తానని తెలిపారు.

vegetables distributed to the poor by the corporator in karimnagar
కార్పొరేటర్​ దాతృత్వం.. కూరగాయల పంపిణీ

By

Published : Apr 9, 2020, 12:36 PM IST

కరోనా నివారణలో భాగంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా లాక్​డౌన్ ఉండడం వల్ల ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. వలస కార్మికులు, కూలీలు పనులు లేకపోవడం వల్ల పూటగడవక పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిని గమనించిన కరీంనగర్​లోని 15వ వార్డు కార్పొరేటర్​ డివిజన్​లో ఇంటింటికి తిరుగుతూ కూరగాయలను పంపిణీ చేశారు.

లాక్​డౌన్ ముగిసే అంతవరకు ఎవరు బయటకు రావొద్దని ఆయన కోరారు. ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలని.. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. మాస్కులు ధరించాలని.. భౌతిక దూరం పాటించాలని ప్రజలను కోరారు.

ఇవీచూడండి:కోయలేక.. కోసినా అమ్మలేక.. చ'మిర్చి'న రైతు కళ్లు!

ABOUT THE AUTHOR

...view details