కరీంనగర్ పట్టణం 36వ డివిజన్ లో హైకోర్ట్ అడ్వకేట్ రామారావు ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. దాదాపు 200 మంది పేదలకు బియ్యం,14 రకాల నిత్యావసర వస్తువులు మంకమ్మతోట పారమిత స్కూల్ ల్లో స్థానికులకు అందజేశారు.
కరోనా అనంతరం.. జీవన విధానంలో పెనుమార్పులు.. - కరీంనగర్ పట్టణంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ
కరీంనగర్ పట్టణంలో హైకోర్ట్ అడ్వకేట్ రామారావు ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. పేదలకు బియ్యం,14 రకాల నిత్యావసర వస్తువులు అందజేశారు. కరోనా అనంతరం మన జీవన విధానంలో పెనుమార్పులు వస్తాయని పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళితే మాస్కులు ధరించాలని సూచించారు.
![కరోనా అనంతరం.. జీవన విధానంలో పెనుమార్పులు.. Vegetable Distribution In Karimnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7154432-100-7154432-1589197173094.jpg)
కరోనా అనంతరం.. జీవన విధానంలో పెనుమార్పులు..
దేశంలోనే కరీంనగర్ జిల్లా మంచి పేరు తెచ్చుకునేలా ప్రజలు లాక్ డౌన్ విజయవంతంగా పాటిస్తున్నారని రామారావు తెలిపారు. కరోనా అనంతరం మన జీవన విధానంలో పెనుమార్పులు వస్తాయని పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళితే మాస్కులు ధరించాలని సూచించారు.
ఇదీ చూడండి:ప్రాణాలు తీసే కంపెనీ మాకొద్దు: ఆర్ఆర్ వెంటాపురం గ్రామస్థులు