తెలంగాణ

telangana

ETV Bharat / state

'నీటి' కోసం వంటావార్పు - kaleswaram

సాగునీరు వస్తుందంటే పొలాలు వదులుకున్నారు. ఏళ్లు గడిచినా.. పనులు పూర్తి కాలేదు. ఎన్నిసార్లు అడిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఇలా కాదంటూ ఆ రైతులు ఆందోళనకు దిగారు. ప్రాజెక్టు వద్దే వంటావార్పు జరిపి నిరసన తెలిపారు. వెంటనే నేతలు స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

'నీటి' కోసం రైతుల వంటావార్పు

By

Published : Mar 7, 2019, 7:31 PM IST

'నీటి' కోసం రైతుల వంటావార్పు
ఎండిపోతున్న పంట పొలాలకు సాగునీరు అందించాలంటూ... కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ రైతులు ఆందోళన చేశారు. కాళేశ్వరం 8వ ప్యాకేజీ పనుల వద్ద వంటావార్పు చేపట్టి నిరసనకు దిగారు. భూగర్భ పైప్​లైన్ కోసం ఇప్పటికే తమ గ్రామవాసులు 300 ఎకరాల భూమి కోల్పోయారని సర్పంచి రామచంద్రా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పందించి... పాత చెరువు పూడిక తీసి, నీటితో నింపాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:'రక్షక' కూలీలు

ABOUT THE AUTHOR

...view details