తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేవలం ఒక్క రూపాయికే వైకుంఠథామం' - karimnagar municipal corporation

కేవలం ఒక్క రూపాయికే అంత్యక్రియలతో పాటు వైకుంఠథామంలోనే డెత్‌ సర్టిఫికెట్‌ ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నట్లు కరీంనగర్ మేయర్ రవిందర్ సింగ్ తెలిపారు. అంతేకాకుండా నగరంలోని అన్ని వైకుంఠథామాల్లో అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించేందుకు నగరపాలక సంస్థ నడుం బిగించింది.

జూన్ 15 నుంచి పూర్తి స్థాయి కార్యక్రమం :మేయర్

By

Published : May 21, 2019, 5:47 AM IST

పేదవాడికి ఆఖరి ప్రయాణం ఆర్థికభారం కాకూడదన్న ఉద్దేశ్యంతో కరీంనగర్‌ నగరపాలక సంస్థ నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. మతమేదైనా.. కులమేదైనా వారి ఆచారాల ప్రకారం.. కేవలం ఒక్క రూపాయికే ఆఖరి మజిలీ చేపట్టేలా ప్రణాళిక అమలు చేస్తోంది. అంత్యక్రియల కోసం ప్యాకేజీలతో చేస్తున్న దోపిడీని అరికట్టడమే కాకుండా ఆ కుటుంబాలకు ఉపశమనం కలిగించే విధంగా బృహత్తర కార్యక్రమం చేపట్టింది.

పేదవాడికి చివరి ప్రయాణం ఆర్థికభారం కాకూడదు : మేయర్
ఈ విధానాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే సుమారు కోటిన్నర రూపాయల నిధులను నగర పాలక సంస్థ కేటాయించింది. మురికివాడలు అధికంగా ఉన్న కరీంనగర్​లో అంత్యక్రియలు జరిపించేందుకు పేదలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇది గమనించిన మేయర్ రవిందర్ సింగ్‌ తగిన చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఒక్క రూపాయికే కుళాయి పథకం ప్రారంభించి ఆదర్శంగా నిలిచిన నగర పాలక సంస్థ.. కొత్తగా వైకుంఠథామ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జూన్ 15 నుంచి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం అమల్లోకి రానుంది.

ABOUT THE AUTHOR

...view details