ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతోంది. గురువారం సాయంత్రం వరకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
'ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతోన్న ధర్మపురి ఆలయం' - ముక్కోటి ఏకాదశి తాజా వార్తలు
ముక్కోటి ఏకాదశి పర్వదినానికి ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముస్తాబవుతోంది. గురువారం సాయంత్రం వరకు ఏర్పాట్లు పూర్తవుతాయని ఆలయ అధికారులు తెలిపారు.
!['ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతోన్న ధర్మపురి ఆలయం' vaikunta ekadashi arrangements are ongoing in dharmapuri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9988897-306-9988897-1608795062944.jpg)
'ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతోన్న ధర్మపురి ఆలయం'
రాత్రి 2. 30 గంటలకు లక్ష్మీసమేత యోగ, ఉగ్ర, నరసింహ స్వామి మూల విరాట్లకు మహాక్షీరాభిషేకం ఉంటుందని అధికారులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద ఆసీనులైన స్వామి వార్లకు పుష్పవేదికపై నివేదనలు, ప్రత్యేక పూజ.. అనంతరం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని వెల్లడించారు.