తెలంగాణ

telangana

ETV Bharat / state

ధర్మపురి ఆలయంలో వైభవంగా ఏకాదశి ఉత్సవాలు - ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం

కరీంనగర్​ జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్తరద్వారం గుండా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, స్థానిక ఎంపీ వెంకటేష్ నేత స్వామివారిని దర్శించుకున్నారు.

vaibhava-ekadashi-celebrations-at-dharmapuri-temple
ధర్మపురి ఆలయంలో వైభవంగా ఏకాదశి ఉత్సవాలు

By

Published : Jan 6, 2020, 5:09 PM IST


ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున నాలుగు గంటలకే పుష్ప వేదికపై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐదున్నర గంటలకు కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ, విశ్వంజీ మహరాజ్ స్వామీజీ కలిసి ఉత్తర ద్వారాన్ని తెరిచారు. ఉత్తరద్వారం గుండా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, స్థానిక ఎంపీ వెంకటేష్ నేత స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ధర్మపురి ఆలయంలో వైభవంగా ఏకాదశి ఉత్సవాలు

ABOUT THE AUTHOR

...view details