కరీంనగర్ జిల్లాలోని గ్రామాల్లో, మండలాల్లో ప్రజలకు ప్రతి రోజు మిషన్ భగీరథ ద్వారా మంచి నీరు సరఫరా చేస్తామని కలెక్టర్ శశాంక అన్నారు. కలెక్టరేట్లో అర్బన్ ఏరియా మిషన్ భగీరథ నీటి సరఫరాపై మున్సిపల్, వాటర్ గ్రిడ్, పబ్లిక్ హెల్త్, ఎల్ అండ్ టి ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ నీటి సరఫరా పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
మిషన్ భగీరథ పనులపై కలెక్టర్ సమీక్ష - కరీంనగర్ లో మున్సిపల్, వాటర్ గ్రిడ్, పబ్లిక్ హెల్త్ , ఎల్ అండ్ టి ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో అర్బన్ ఏరియా మిషన్ భగీరథ నీటి సరఫరాపై మున్సిపల్, వాటర్ గ్రిడ్, పబ్లిక్ హెల్త్, ఎల్ అండ్ టి ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ శశాంక సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ నీటీ సరఫరా పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
'మిషన్ భగీరథ పనులు త్వరగా పూర్తి చేయాలి'
నగర పాలక సంస్థలో కలిసిన విలీన గ్రామాల ప్రజలకు త్రాగు నీరు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. అసంపూర్తిగా ఉన్న పైపు లైన్లకు ఇంటర్ కనెక్షన్లతో పాటు, ప్రతి ఇంటికి భగీరథ కనెక్షన్లను ఇవ్వాలన్నారు. స్మార్ట్ సిటి పనులపై మున్సిపల్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. వర్షాకాలం ప్రారంభం అవుతున్నందున పెండింగ్ పనులన్ని త్వరగా పూర్తి చేసి నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు.