తెలంగాణ

telangana

ETV Bharat / state

వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించిన చిన్నారులు - వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు వార్తలు

కరీంనగర్‌కు చెందిన ఇద్దరు చిన్నారులు వండర్ బుక్‌ ఆఫ్‌ రికార్డులు సాధించారు. పిన్న వయస్కుడైన సాయి అక్షిత్‌ కేవలం 23 సెకన్లలో 250 డిజిట్‌ గల సంఖ్యను మల్టీప్లై చేయడంతో పాటు అతితక్కువ సమయంలోనే ఏబీసీడీలు రివర్స్‌లో చదివి రెండు రికార్డులు సృష్టించాడు.

వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించిన చిన్నారులు
వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించిన చిన్నారులు

By

Published : Sep 17, 2020, 11:04 PM IST

కరోనా లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న కరీంనగర్‌కు చెందిన ఇద్దరు చిన్నారులు వండర్ బుక్‌ ఆఫ్‌ రికార్డులు సాధించారు. పిన్న వయస్కుడైన సాయి అక్షిత్‌ కేవలం 23 సెకన్లలో 250 డిజిట్‌ గల సంఖ్యను మల్టీప్లై చేయడంతో పాటు అతితక్కువ సమయంలోనే ఏబీసీడీలు రివర్స్‌లో చదివి రెండు రికార్డులు సృష్టించాడు. అతని సోదరుడు సాయి అతర్వ కేవలం 6.81 సెకన్లలో ఏబీసీడీలు రివర్స్‌గా చదివి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.

కరీంనగర్ వేదికగా ఇద్దరు చిన్నారులు తమ ప్రతిభను కనబరిచి వీక్షకులను ఆశ్చర్యపరిచారు. ప్రతిభ ప్రతి ఒక్కరిలోను ఉంటుందని అయితే దానిని గుర్తించి సానపడితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని చిన్నారుల తల్లి సుధారాణి తెలిపారు. ఇద్దరు చిన్నారులకు వండర్ బుక్‌ ఆఫ్ రికార్డు ప్రతినిధి సింగారపు శివరామకృష్ణ ధ్రువీకరణ పత్రంతో పాటు పథకాలు అందించారు. ప్రస్తుతం వండర్ రికార్డు సాధించిన చిన్నారులను గిన్నీస్‌బుక్ రికార్డు లక్ష్యంతో ఉన్నట్లు తల్లిదండ్రులు వెల్లడించారు.

ఇదీ చదవండి:వండర్​కిడ్​: ప్రపంచమెరిగిన బాలుడు.. భవిష్యత్​ వ్యోమగామి..!

ABOUT THE AUTHOR

...view details