కరీంనగర్ గ్రామీణ జిల్లా నగునూరు గ్రామానికి చెందిన మల్లయ్య, అదే గ్రామానికి చెందిన రాకేష్, భిక్షపతి భూ తగాదాలతో కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. అడ్డువచ్చిన మల్లయ్య భార్యను కూడా కర్రలతో చితకబాదారు.
భూవివాదంతో కర్రలతో చితకబాదుకున్నారు! - two people fight with sticks at nagunoor on land issue
కరీంనగర్ జిల్లా నగునూరు గ్రామంలో ఓ భూ వివాదంతో రెండు వర్గాలు కర్రలతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు కాగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భూవివాదంతో కర్రలతో చితకబాదుకున్నారు!
కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య భూమి విషయంలో వివాదాలు జరుగుతున్నాయి. వాగ్వాదాలు ఒక్కసారిగా పెరిగి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. పోలీసులు ఇరువర్గాలపైనా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:తొలిగిన అవరోధాలు.. ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు