కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందిన ఇద్దరు బామ్మలు కరోనా మహమ్మారిని జయించారు. జులై 26న కరోనా బారిన పడిన జనగాం ఆగమ్మ, గుర్రం లచ్చమ్మలు ఇళ్ల వద్ద చికిత్స పొందారు. 90 ఏళ్లు దాటినా ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా వైద్యుల సలహాలు పాటించి... వైరస్ నుంచి కోలుకున్నారు.
తొమ్మిది పదుల వయసులోను కొవిడ్‌ను జయించిన బామ్మలు
కొవిడ్ పాజిటివ్ వస్తే ప్రాణం మీద ఆశ వదిలేసుకోవాల్సిందే... వృద్ధులయితే బతకడం కష్టం అని అపోహపడే వాళ్లకు ఈ బామ్మల కథ ఓ అవగాహన పాఠం. గంగాధర మండలానికి చెందిన ఇద్దరు బామ్మలు తొమ్మిది పదుల వయసులో మహమ్మారి బారినపడి... హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుని ఆరోగ్యంగా బయటపడ్డారు.
తొమ్మిది పదుల వయసులోను కొవిడ్‌ను జయించిన బామ్మలు
ఇద్దరు బామ్మలు అక్కాచెల్లెలు కాగా.. గుర్రం లచ్చమ్మ మధురానగర్లోను, జనగాం ఆగమ్మ లక్ష్మీదేవిపల్లిలోను ఉన్నారు. కొవిడ్‌తో భయాందోళనలు చెందుతున్న వారికి తమ వంతు ధైర్యం చెబుతున్నారు ఈ బామ్మలు.