హుజూరాబాద్‌లో దళితబంధు నిలిపివేతపై హైకోర్టులో(TS High Court news) మరో రెండు వ్యాజ్యాలు(pil in high court on dalit bandh suspension in huzurabad) దాఖలయ్యాయి. భాజపా నేత చంద్రశేఖర్, కాంగ్రెస్ నేత జడ్సన్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. మల్లేపల్లి లక్ష్మయ్య దాఖలు చేసిన పిల్ హైకోర్టులో ఇవాళ విచారణకు రాగా.. అన్ని పిటిషన్లను కలిపి సోమవారం విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. దళితబంధు(Dalitha badhu news in Telangana) నిలిపివేయాలన్న ఎన్నికల సంఘం ఉత్తర్వులు సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈసీ ఉత్తర్వులు రద్దు చేయాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు. హుజూరాబాద్‌లో దళిత బంధు కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
TS High Court news: దళితబంధు నిలిపివేతపై మరో రెండు వ్యాజ్యాలు - తెలంగాణ వార్తలు
12:09 October 22
హైకోర్టులో భాజపా నేత చంద్రశేఖర్, కాంగ్రెస్ నేత జడ్సన్ పిటిషన్లు
హుజురాబాద్‌లో దళిత బంధు పథకాన్ని ఎన్నికల కమిషన్ నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో గురువారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది (pil in high court on dalit bandh suspension in huzurabad). సామాజిక కార్యకర్త, సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల అమలు నిలిపివేయాలని పిటిషర్ కోరారు. ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకముందే... దళితబంధు పథకం అమలు ప్రారంభమైందన్నారు. దళితబంధుతో పాటు రైతుబంధు వంటి అనేక సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయని లక్ష్మయ్య పేర్కొన్నారు. నోటిఫికేషన్‌కు ముందు అమల్లో ఉన్న కార్యక్రమాలను నిలిపివేయరాదన్న నిబంధనను ఈసీ విస్మరించిందన్నారు. మిగతా పథకాలను ఆపకుండా కేవలం దళితుల సంక్షేమం కోసం చేపట్టిన దళితబంధును ఆపారని పిల్లో పేర్కొన్నారు (pil in high court on dalit bandh suspension in huzurabad). దురుద్దేశపూరితంగా అడ్డుకున్నారు ప్రభుత్వం తన విధులు నిర్వర్తించకుండా కొన్ని రాజకీయ పార్టీలు, కొందరు వ్యక్తులు దురుద్దేశపూరితంగా అడ్డుకోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ఈసీ తన పరిధి దాటి చట్టవిరుద్ధంగా హుజూరాబాద్‌లో దళితబంధును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని (pil in high court on dalit bandh suspension in huzurabad) పిల్లో పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, రాష్ట్ర ప్రభుత్వం, ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఈసీ కీలక నిర్ణయం
రాష్ట్రంలో ఈ నెల 30న జరగనున్న హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది (dalit bandhu suspension in huzurabad). ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్‌కు ఈసీ లేఖ రాసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తరుణంలో ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. హుజూరాబాద్ ఉపఎన్నిక పూర్తయ్యే వరకు దళితబంధు అమలును నిలిపివేయాలని.. ఎన్నిక తర్వాత యథావిధిగా కొనసాగించవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
నిధులు జమ చేసే ప్రక్రియ నిలిపివేత
హుజూరాబాద్ ఉపఎన్నిక పూర్తయ్యే వరకు దళితబంధు నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే ప్రక్రియను నిలిపివేయనున్నట్లు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ (karimnagar collector) వెల్లడించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో వివిధ పార్టీలకు చెందిన 30 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ నెల 30న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది.
TAGGED:
TS High Court news