తెలంగాణ

telangana

ETV Bharat / state

fake gold case in AP: పాత బంగారం దొరికిందని... 'కొత్త'గా మోసం చేశారు! - గుత్తిలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

Fake Gold Case in Anantapur District: మేం జేసీబీ పనులు చేస్తామని చెబుతారు..! పనులు చేస్తుండగా.. ఓ చోట తమకు పాత బంగారం దొరికిందంటారు..! తమకేం తోచటంలేదని.. ఎంతో కొంత ఇచ్చి.. తమ వద్ద ఉన్న బంగారం తీసుకోండి అంటూ.. అమాయకంగా మాట్లాడుతారు. నెమ్మదిగా.. ట్రాక్​లోకి దింపుతారు..! రూ.2 కేజీల బంగారం.. రూ.6 లక్షలకే ఇచ్చేస్తామని చెప్పేస్తారు! ఇంకేముంది.. ఈ నయా కేటుగాళ్ల మాటలను నమ్మినవారు అత్రుతగా వచ్చేస్తారు. ట్రయల్ ​రన్​లో భాగంగా.. అసలు బంగారమే చూపిస్తారు ఈ మోసగాళ్లు. ఇది నమ్మిన బాధితులు.. 6 లక్షలు అప్పజెప్పి.. 2కేజీల బంగారం తీసుకెళ్తారు. తీరా చూస్తే.. అది అసలు బంగారం కాదు.. నకిలీది అని తేలుతుంది. ఈ తరహా నయామోసం.. ఏపీలోని అనంతపురం జిల్లా గుత్తిలో వెలుగు చూసింది.

fake gold case in AP
నకిలీ బంగారంతో కరీంనగర్ వాసికి టోకరా

By

Published : Dec 22, 2021, 7:09 PM IST

Fake Gold Case in Anantapur District: తక్కువ ధరకే బంగారం విక్రయిస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్న ఓ ముఠా.. ఆట కట్టించారు ఏపీలోని అనంతపురం జిల్లా పోలీసులు. నకిలీ బంగారం విక్రయిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై డీఎస్పీ చైతన్య వివరాలు వెల్లడించారు.

పోలీసుల వివరాలు ప్రకారం..

Fake Gold fraud: కడప జిల్లాలోని వీరబల్లి మండంల షికారిపాలెంకు చెందిన ఇద్దరు వ్యక్తులు జేసీబీ ఆపరేటర్​గా పని చేస్తుంటారు. తవ్వకాల్లో భాగంగా తమకు పాత బంగారం దొరికిందని కరీంనగర్​కు చెందిన వ్యక్తిని నమ్మించారు. నెమ్మదిగా ట్రాక్​లోకి దింపారు. వారి వద్ద ఉన్న అసలు బంగారు పూసలను చూపించారు. సొమ్ము రూ.20 లక్షలు ఉంటుందని... కేవలం రూ.6 లక్షలకే ఇస్తామని మాయమాటలు చెప్పారు. కేటుగాళ్ల మాటలను నమ్మిన సదరు వ్యక్తి.. తక్కువ ధరకే ఎక్కవ బంగారం వస్తుందని ఆశపడ్డాడు. ఇంకేముంది... రూ.6 లక్షలను వారికి అప్పగించి.. 2 కేజీల బంగారం తీసుకున్నాడు.

అసలు రంగు బయటపడింది..

Fake Gold Case in AP: ఇంతవరకు బాగానే ఉందనుకున్న కరీంనగర్​ వాసికి.. ఒక్కసారిగా షాక్ తగిలింది. తాను తీసుకున్నది నకిలీ బంగారమని తేలటంతో.. మోసపోయామని గ్రహించాడు. ఇంకేముంది.. ఈ నెల 18వ తేదీన అనంతపురం జిల్లా గుత్తి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.

రైల్వేస్టేషన్​ దగ్గర కేటుగాళ్లు.. విచారణలో...

fraud at railway stations: ఈ కేసులో విచారణ చేపడతున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం.. గుత్తి రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయగా.. నకిలీ బంగారు బాగోతం బయటపడింది. ఇద్దరు నిందితుల వద్ద నుంచి రూ.6 లక్షల నగదుతో పాటు 2 కేజీల నకిలీ బంగారు పూసలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్​కు తరలించనున్నట్లు డీఎస్పీ చైతన్య వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details