నారాయణపూర్ రిజర్వాయర్ కింద భూములు, ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైనవారికి అండగా ఉంటామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. కరీంనగర్లోని విలేకరులు భవనంలో మూడు రోజులుగా ముంపు ప్రాంత ప్రజలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిర్వాసితులకు ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరముందన్నారు.
ముంపు బాధిత నిర్వాసితులను ప్రభుత్వమే ఆదుకోవాలి: ఎల్.రమణ - karimnagar latest news
నారాయణపూర్ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. కరీంనగర్లోని విలేకరుల భవనంలో మూడు రోజులుగా ముంపు బాధిత గ్రామాల ప్రజలు చేసిన రిలే నిరాహారదీక్ష ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ముంపు బాధిత నిర్వాసితులను ప్రభుత్వమే ఆదుకోవాలి: ఎల్.రమణ
ఆర్‌ఆర్ చట్టంకింద ఇళ్లు నిర్మించడమే కాకుండా... పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధితుల తరఫున న్యాయం కోసం పోరాడతామని హామీ ఇచ్చారు. దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. కరోనా బాధితుతులకు న్యాయం చేసేందుకు వీలుగా 2023 శాసనసభ ఎన్నికల తెదెపా మెనిపెస్టోలో పొందుపరుస్తామని వెల్లడించారు.