ఆర్టీసీ సమ్మె కారణంగా మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.25 వేల ఆర్థిక సాయం చేస్తామని తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు. కరీంనగర్ జిల్లాలో ఇటీవల మరణించిన ఆర్టీసీ డ్రైవర్ రాజు, మెకానిక్ కరీంఖాన్ కుటుంబాలను ఆయన పరామర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆర్థికసాయం చెక్కులను బాధితులకు అందించారు.
బాధిత ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు తెదేపా ఆర్థికసాయం - బాధిత ఆర్టీసీ కార్మికులకు తెలుగుదేశం ఆర్థికసాయం
ఇటీవల మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు రూ.25 వేల ఆర్థికసాయం చేస్తామని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు. కరీంనగర్‌లోని పార్టీ కార్యాలయంలో బాధిత కుటుంబాలకు చెక్కులు అందించారు. కార్మికుల తరఫున తెదేపా పోరాటం చేస్తుందన్నారు.
![బాధిత ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు తెదేపా ఆర్థికసాయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5077186-630-5077186-1573833715980.jpg)
బాధిత ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు తెదేపా ఆర్థికసాయం
42 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు ఎల్. రమణ. విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కన పెడుతున్నామని.. మిగిలిన సమస్యలను పరిష్కరించాలని కోరినా సర్కారు స్పందించకపోవడాన్ని తప్పుపడ్డారు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు తెదేపా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
బాధిత ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు తెదేపా ఆర్థికసాయం
ఇవీచూడండి: ఉద్యోగం రాదని ఆర్టీసీ అద్దెబస్సు డ్రైవర్ ఆత్మహత్యాయత్నం