తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్​లో బస్సులను అడ్డుకుంటున్న ఆర్టీసీ కార్మికులు

కరీంనగర్ జిల్లా కేంద్రంలో కార్మికులు ఉదయం నుంచే డిపోల వద్దకు చేరుకొని డిపోల్లో నుంచి బస్సులు రానీయకుండా అడ్డుపడుతున్నారు.

Breaking News

By

Published : Oct 15, 2019, 9:25 AM IST

ఆర్టీసీ కార్మికుల చేపట్టిన సమ్మె కరీంనగర్​లో 11వ రోజు ఉద్ధృతంగా సాగుతోంది. ఈ రోజు ఉదయమే ఆర్టీసీ కార్మికులు డిపోలకు చేరుకొని కార్యాలయాలా ముందు బైఠాయించారు. బస్సులను బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు, మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వానికి కార్మికుల ఆత్మబలిదానాలు కనిపించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం స్పందించి వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.

కరీంనగర్​లో బస్సులను అడ్డుకుంటున్న ఆర్టీసీ కార్మికులు

ABOUT THE AUTHOR

...view details