కరీంనగర్లో ప్రశాతంగా ముగిసిన బంద్ - TSRTC Strike in Karimnagar district
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్‌కు అఖిలపక్ష నేతలు మద్దతును ప్రకటించారు. ఉదయం నుంచి డిపోల నుంచి ఒక్క బస్సుకు బయటకు రాకపోవటం వల్ల సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
![కరీంనగర్లో ప్రశాతంగా ముగిసిన బంద్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4805533-204-4805533-1571495841319.jpg)
ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా సంపూర్ణంగా ముగిసింది. ఉదయం 4గంటల నుంచి ఆర్టీసీ కార్మికులు బస్ డిపోల ముందు బైఠాయించారు. తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగం పొందిన వారిని కూడా అడ్డుకున్నారు. దీనితో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పది డిపోల నుంచి ఒక్క బస్సు సర్వీసు కూడా బయటికి రాలేదు. బంద్‌కు అఖిల పక్ష నేతలు, వివిధ సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీనితో నగరంలోని వ్యాపార వాణిజ్య సంస్థలు పెట్రోల్ బంకులు హోటళ్లు మూసివేశారు. ఏబీవీపీ కార్యర్తలు భవనంపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. కరీంనగర్‌తో పాటు జగిత్యాల, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాలో బంద్ ప్రశాంతంగా విజయవంతంగా సాగింది.