తెలంగాణ

telangana

'తప్పుడు సమాచామిచ్చిన సునీల్​శర్మను అరెస్టు చేయాలి'

By

Published : Nov 17, 2019, 3:30 PM IST

కరీంనగర్​ బస్టాండ్​లో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. కోర్టుకు తప్పుడు సమాచారమిచ్చిన ఎండీని అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు.

TSRTC EMPLOYEES PROTEST AGAINST RTC MD SUNIL SHARMA

ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన ఎండీ సునీల్​శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్​లో కార్మికులు ఆందోళన చేశారు. బస్టాండ్ ముందు ఎండీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా... సమ్మెను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఎండీ బుద్ధి తెచ్చుకోవాలని ఆర్టీసీ కార్మికులు హెచ్చరించారు.

'తప్పుడు సమాచామిచ్చిన సునీల్​శర్మను అరెస్టు చేయాలి'

ఇదీ చూడండి : 40 ప్రేమ కథల 'కడలి'

ABOUT THE AUTHOR

...view details