కరీంనగర్ జిల్లా కేంద్రంలో మరో ఆర్టీసీ కార్మికుడు మృతి చెందాడు. కరీమ్ ఖాన్ కరీంనగర్ రెండవ డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గత 15 రోజుల క్రిత కరీమ్‌కి గుండెపోటు వచ్చింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెండ్రోజుల తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాడు. కొద్ది రోజుల క్రితం డ్రైవర్ బాబు అంతిమయాత్రలో పాల్గొన్నాడు. అక్కడ మరోసారి గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు.
గుండెపోటుతో మరో ఆర్టీసీ కార్మికుడు మృతి - గుండెపోటుతో ఆర్టీసీ కార్మికుడి మృతి
కరీంనగర్ జిల్లాలో మరో ఆర్టీసీ కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. కరీమ్ మృతికి ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
గుండెపోటుతో మరో ఆర్టీసీ కార్మికుడు మృతి
మళ్లీ కరీమ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ కరీమ్ ఈ రోడు ఉదయం నాలుగు గంటల సమయంలో మృతి చెందాడు. కరీమ్ మృతితో ఆయన స్వగ్రామమైన ఆరెపల్లిలో విషాధ ఛాయలు అలముకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా పరోక్షంగా కార్మికులను హత్య చేస్తున్నారని బంధువులు ఆరోపించారు.
ఇవీ చూడండి: కళాశాల అధ్యాపకుడిని దారుణంగా కొట్టిన విద్యార్థులు