తెలంగాణ

telangana

By

Published : Oct 29, 2019, 10:14 AM IST

Updated : Oct 29, 2019, 11:31 AM IST

ETV Bharat / state

బస్సులెక్కాలంటే ఆలోచించాల్సిందే...

ఏ బస్సు చూసినా చెత్తా చెదారంతో నిండిపోయింది. మురికితో జిడ్డులా మారి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. బస్సు ఎలా ఉన్నా క్షేమంగా వెళ్లాలని బస్సులు ఎక్కుతున్న ప్రజలకు... ప్రమాదాలే శరణ్యమవుతున్నాయి. ఇన్నాళ్లు చిన్న చిన్న ప్రమాదాలతో బయటపడినా మరో వారం రోజులు సమ్మె కొనసాగితే... దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. వీటంతటికి కారణం బస్సుల మెయింటనెన్స్ సరిగ్గా లేకపోవడమే.

ఆ బస్సులెక్కాలంటే ఆలోచించాల్సిందే...

బస్సులెక్కాలంటే ఆలోచించాల్సిందే...

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని... 26 సమస్యలు పరిష్కరించాలని కార్మికులు చేస్తున్న సమ్మె 25వ రోజుకు చేరుకుంది. అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు మెట్టు దిగిరాకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో నడిపిస్తున్నారు. అంతా బాగానే ఉన్నా ఇప్పుడు రోజువారిగా బస్సులకు చేసే మెయింటనెన్స్ చేయట్లేదు.

కొన్ని మధ్యలోనే ఆగిపోతున్నయ్..

ప్రస్తుతం తాత్కాలిక కార్మికులు ప్రైవేటు బస్సులను శుభ్రం చేయటంలేదు. బస్సుల్లో చెత్త పేరుకుపోతోంది. బస్సులను కడగక పోవడం వల్ల లోపలా బయట అంతా మురికి చేరిపోయింది. ఇక బ్యాటరీలు ఛార్జింగ్‌ చేయకపోవడం వల్ల మూడు డిపోల్లో బ్యాటరీలు డిచ్చార్జీ అయిపోతున్నాయి. మరో బ్యాటరీ అమర్చి బస్సును స్టాట్‌ చేసి పంపుతున్నారు. కొన్ని మార్గమధ్యలో ఆగిపోతున్నాయి. బస్సు ఆగితే ప్రయాణికులే తోయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. బ్యాటరీలు లేక లైట్లు కూడా పని చేయని స్థితి ఏర్పడుతోంది. బస్సుకు పవర్‌ స్టీరింగ్‌ అయిల్‌ మార్చాలి. ఒక వేళ మార్చకపోతే బస్సులు అదుపు తప్పి పక్కకు గుంజుకుపోయే ప్రమాదం ఉంది. చక్రాల నట్లు కూడా ఊడి పోతున్నాయి. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ... ఇవే బస్సులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి.

అనుభవం లేని డ్రైవర్ల వల్ల

బస్సులు తరచు రోడ్డుపైన ఎక్కడో ఓ దగ్గర నిలిచిపోతున్నాయి. ఇప్పటి వరకు చిన్న చిన్న ప్రమాదాలతోనే కాలం గడిచి పోయింది. ఇలాగే కొనసాగితే పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అనుభవం లేని డ్రైవర్లు కావటం వల్ల ప్రమాదాలు మరింత ఎక్కవయ్యే అవకాశాలు ఉన్నాయి.

అటు ఆర్టీసీ, ఇటు ప్రభుత్వం ఓ మెట్టు దిగొచ్చి సమ్మె విరమింపజేస్తే... సమస్య ఇక్కడితో తీరే అవకాశముంది. ఇలాగనే కొనసాగితే మాత్రం వారం రోజుల్లో బస్సులు ఆగిపోవడం, ప్రమాదాలు జరగడం ఎక్కువవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి: నేటి నుంచి దిల్లీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

Last Updated : Oct 29, 2019, 11:31 AM IST

ABOUT THE AUTHOR

...view details