తెలంగాణ

telangana

ETV Bharat / state

చొప్పదండి నియోజకవర్గంలో ఆర్టీసీ బంద్​... నేతల అరెస్ట్​ - CHAPPADHANDI NEWS

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల రాష్ట్ర బంద్​ ప్రశాంతంగా జరిగింది. కరీంనగర్​ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో పలు చోట్ల బంద్​లో భాగంగా నిరసనలు చేపట్టిన విపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

TSRTC BANDH SUCCESSFULLY COMPLETED IN CHOPPADHANDI

By

Published : Oct 19, 2019, 8:05 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండిలో విపక్షాలు బంద్​లో పాల్గొన్నాయి. కాంగ్రెస్, భాజపా, తెదేపా నాయకులు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు నేతలను అదుపులోకి తీసుకున్నారు. రామడుగులో విపక్షాలు రాస్తారోకో చేపట్టగా పోలీసులు అరెస్టు చేశారు. గంగాధరలో పోలీస్ బందోబస్తుతో ఆర్టీసీ బస్సులను నడిపించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఓ బస్సు వెనుక అద్దం పగలగొట్టారు. కరీంనగర్-జగిత్యాల రహదారిపై ప్రయాణికులతో కూడిన బస్సులను పోలీస్ ఎస్కార్ట్​తో నడిపించారు. చొప్పదండి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో విపక్ష నాయకులు వ్యాపార సముదాయాలను మూసివేయించారు.

చొప్పదండి నియోజకవర్గంలో ఆర్టీసీ బంద్​... నేతల అరెస్ట్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details