తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడో పంపు వెట్​రన్​ విజయవంతం - kaleswaram

కాళేశ్వరం ఆరో ప్యాకేజ్‌లో మూడో పంపు వెట్​రన్‌ విజయవంతంగా పూరైంది. ధర్మారం మండలం నందిమేడారం వద్ద వద్ద మూడో పంపు వెట్‌రన్‌ పరిశీలనను ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. నాల్గో పంపు వెట్​రన్​ పరిశీలన కూడా నేడే చేపట్టనున్నారు.

నీరు

By

Published : May 15, 2019, 1:09 PM IST

Updated : May 15, 2019, 2:40 PM IST

కాళేశ్వరం ఆరో ప్యాకేజ్‌లో మూడో పంపు వెట్‌ రన్‌ విజయవంతమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మరో రెండు పంపులకు వెట్​రన్ నిర్వహించారు. ధర్మారం మండలం నందిమేడారం వద్ద వద్ద మూడో పంపు వెట్‌రన్‌ పరిశీలనను ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు ప్రారంభించారు.

ఆరో ప్యాకేజీలో భాగంగా ఇప్పటికే రెండు పంపుల పరీక్ష విజయవంతం కాగా... తాజాగా మరో రెండు పంపుల ట్రయల్​రన్​ చేపట్టారు. 126 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు పంపులను గత నెల 24, 25 తేదీల్లో పరీక్షించారు. ఆ పంపులు సర్జ్​పూల్​లోని నీటిని 105 మీటర్ల మేర ఎత్తిపోశాయి. మరో పంపు పరీక్ష నిర్వహిస్తే..ఆరో ప్యాకేజీలోని నాలుగు పంపుల పరీక్ష పూర్తవుతుంది. అనంతరం 15 రోజుల వ్యవధిలో ఒకటి, ఆతర్వాత పక్షం రోజుల్లో మరో పంపును పరీక్షించాలని ఇంజినీర్లు భావిస్తున్నారు. జూన్ రెండో వారం నాటికి ఆరో ప్యాకేజీలో ఆరు పంపుల పరీక్ష పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు ఉన్నారు.

మూడో పంపు వెట్​రన్​ విజయవంతం

ఇవీ చూడండి: జూరాలకు 'జల' కళొచ్చింది

Last Updated : May 15, 2019, 2:40 PM IST

ABOUT THE AUTHOR

...view details