భవిష్యత్ తరాల కోసం పటిష్ఠ నాయకత్వాన్ని తయారు చేసుకునేందుకు అన్ని వర్గాల ప్రజలను పార్టీలో చేర్చుకోవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర గ్రామంలో ఏర్పాటు చేసిన తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
'పటిష్ఠ నాయకత్వం కోసం అందరిని పార్టీలో చేర్చుకోవాలి' - boinapally vinod kumar latest news
కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ప్రారంభించారు. పటిష్ఠ నాయకత్వాన్ని తయారు చేసుకునేందుకు అన్ని వర్గాల ప్రజలను పార్టీలో చేర్చుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

'పటిష్ఠ నాయకత్వం కోసం అందరిని పార్టీలో చేర్చుకోవాలి'
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మొదటి సభ్యత్వాన్ని స్వీకరించారు. అనంతరం తెరాస పార్టీ ఇంఛార్జ్ బస్వరాజు సారయ్య, పార్టీ నాయకులు కార్యకర్తల నమోదు ప్రక్రియ చేపట్టారు.