కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామంలోని కేసీఆర్ వనంలో తెరాస నాయకులు పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ల చిత్ర పటాలపై పాలు పోశారు. గతంలో చేపట్టిన హారితహారంలో వెదురుగట్టకు చెందిన 175 ఎకరాల్లో 65వేల మొక్కలు నాటి సంరక్షించారు. హరితహారాన్ని సమర్ధంగా చేపట్టడం వల్ల ఇటీవలే రాష్ట్ర మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సందర్శించి వెళ్లారు.
సీఎం, ఎమ్మెల్యే చిత్ర పటాలకు క్షీరాభిషేకం - kcr vanam vedhurugutta latest news
కరీంనగర్ జిల్లా వెదురుగుట్ట గ్రామంలోని కేసీఆర్ వనంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చిత్ర పటాలకు తెరాస నాయకులు పాలాభిషేకం చేశారు. కేసీఆర్ వనంలో ఆట స్థలం, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు ఎమ్మెల్యే ప్రతిపాదించారు. దీంతో స్థానిక తెరాస నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
![సీఎం, ఎమ్మెల్యే చిత్ర పటాలకు క్షీరాభిషేకం సీఎం, ఎమ్మెల్యే చిత్ర పటాలకు క్షీరాభిషేకం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7980754-113-7980754-1594448914766.jpg)
సీఎం, ఎమ్మెల్యే చిత్ర పటాలకు క్షీరాభిషేకం
అనంతరం కరీంనగర్ సమావేశంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వెదురుగట్ట వనానికి కేసీఆర్ వనంగా పేరు పెట్టాలని ప్రతిపాదించగా మంత్రి గంగుల కమలాకర్ తీర్మానాన్ని ఆమోదించారు. కేసీఆర్ వనంలో ఆట స్థలం, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు ఎమ్మెల్యే ప్రతిపాదించారు. దీంతో స్థానిక తెరాస నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ వారి చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు.
ఇవీ చూడండి:సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్