తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస కోఆర్డినేటర్ కారు అద్దాలు ధ్వంసం

కరీంనగర్ ఉమ్మడి జిల్లా తెరాస కోఆర్డినేటర్ అనిల్ కుమార్ గౌడ్ కారు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారు. అర్ధరాత్రి కారు వెనుక అద్దాల ధ్వంసం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

By

Published : Sep 30, 2020, 11:33 AM IST

trs coordinator car mirrors smashed at rekurthi karimnagar
తెరాస కోఆర్డినేటర్ కారు అద్దాలు ధ్వంసం

తెలంగాణ యువజన విభాగం కరీంనగర్ ఉమ్మడి జిల్లా తెరాస కోఆర్డినేటర్ అనిల్ కుమార్ గౌడ్ కారు అద్దాలను దుండగులు ధ్వంసం చేశారు. కరీంనగర్​లోని రేకుర్తిలో అనిల్ కుమార్ ఇంటి ముందు తన కారును నిలిపి ఉంచాడు. అర్ధరాత్రి కారు వెనుక అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు ఇటుకలతో పగులగొట్టారు.

తెరాస కోఆర్డినేటర్ కారు అద్దాలు ధ్వంసం

తానూ రాజకీయంగా ఎదుగుతున్నాననే అక్కసుతోనే దాడి చేశారని ఆయన చెబుతున్నారు. ప్రత్యర్థుల చర్యలకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి :భర్తను కాపాడి ప్రాణాలు విడిచిన భార్య

ABOUT THE AUTHOR

...view details