తెలంగాణ

telangana

ETV Bharat / state

Gellu Srinivas: ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములు సహజం: గెల్లు శ్రీనివాస్‌ - హుజూరాబాద్‌ ఫలితంపై గెల్లు శ్రీనివాస్

హుజూరాబాద్‌ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ ప్రకటించారు. ఉపఎన్నికలో తెరాస పార్టీదే నైతిక విజయమన్నారు. తెరాస ఓటమి కోసం రెండు జాతీయ పార్టీలు ఏకమయ్యాయని గెల్లు ఆరోపించారు.

gellu srinivas
తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌

By

Published : Nov 2, 2021, 9:31 PM IST

తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌

ఈటల రాజేందర్​ గెలుపు కోసం కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్​ను బలి పశువును చేశారని తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ అన్నారు. హుజూరాబాద్‌లో ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని గెల్లు ప్రకటించారు. తెరాస కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని స్పష్టం చేశారు. ఉపఎన్నికలో తెరాస పార్టీదే నైతిక విజయమన్నారు. హుజూరాబాద్‌లో గెలిచిన ఈటలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

తెరాస ఓటమి కోసం రెండు జాతీయ పార్టీలు ఏకమయ్యాయని గెల్లు శ్రీనివాస్‌ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములు సహజమన్నారు. తెరాసకు ఓటేసిన ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. తెరాసను ప్రజలు ఆదరిస్తారనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు. 2023లో హుజురాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగురుతుందని గెల్లు శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:

హుజురాబాద్​లో ఈటల ఘన విజయం.. 24 వేల 68 ఓట్ల మెజార్టీతో గెలుపుబావుటా..

ABOUT THE AUTHOR

...view details