కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉపఎన్నికలో ప్రచారం (Huzurabad By Election Campaign) ఊపందుకుంది. అందరి బాధలు తీర్చే ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఓటర్లను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) కోరారు. హనుమకొండ మండలం కమలాపూర్‌లో నిర్వహించిన ధూమ్‌ధామ్ కార్యక్రమానికి తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్(Gellu Srinivasa Rao)తో కలిసి హాజరయ్యారు. సీఎం కేసీఆర్ (Cm Kcr)కు మానవత్వం లేదన్న ఈటల రాజేందర్ (Etela Rajender) వ్యాఖ్యలను హరీశ్‌రావు తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి తెచ్చిన పథకాల ఫలాలు అనుభవిస్తున్న లబ్ధిదారులను అడిగితే మానవత్వం గురించి చెబుతారని స్పష్టం చేశారు. సామాన్యులపై ధరల భారాన్ని మోపుతున్న భాజపాకు తగిన గుణపాఠం చెప్పాలని హరీశ్ కోరారు.
ఎన్ని జిమ్మిక్కులు చేసినా...
హుజురాబాద్‌లో నిర్వహించిన భాజపా ఎన్నికల శంఖారావం సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay), మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. తెరాస ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఈటల రాజేందర్ అసెంబ్లీలో అడుగు పెడతారని భాజపా రాష్ట్ర బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. తెరాస ఓడిపోతే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా అని బండి సంజయ్ సవాల్ విసిరారు.