కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో 10కేవి విద్యుత్ ఉపకేంద్రాన్ని ట్రాన్స్‌కో-జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంపీ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు రాష్ట్రంలో 24గంటలు కరెంటును నిరంతరాయంగా అందిస్తున్నామన్నారు ప్రభాకర్. అందుకోసం ప్రభుత్వం రూ. 12నుంచి 13వందల కోట్లను ఖర్చు చేస్తోందని వివరించారు.