పోలీస్ కానిస్టేబుళ్లు శిక్షణలోని ప్రతి అంశంపై శ్రద్ధాసక్తులు కనబరచాలని ఆయన తెలిపారు. విధి నిర్వహణను సమర్థవంతంగా కొనసాగించడం ద్వారానే సత్ఫలితాలు సాధించవచ్చని సూచించారు. కరీంనగర్ సిటీ పోలీస్ శిక్షణ కేంద్రంలో కానిస్టేబుళ్ల క్రీడా పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కరీంనగర్లో శిక్షణ కానిస్టేబుళ్లకు క్రీడా పోటీలు - latest news of training constables sports
కరీంనగర్లోని పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ కానిస్టేబుళ్ల క్రీడా పోటీలను నిర్వహించారు. విజేతగా నిలిచిన పోలీసులకు సీపీ కమలాసన్ రెడ్డి బహుమతులను అందించారు.
కరీంనగర్లో శిక్షణ కానిస్టేబుళ్ల క్రీడా పోటీలు
వేలాది మందితో పోటీపడి ఈ ఉద్యోగాన్ని సాధించడం అదృష్టంగా భావించాలన్నారు. శారీరక దృఢత్వం, ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు క్రీడా పోటీల్లో రాణించాలని శిక్షణ కానిస్టేబుళ్లకు సూచించారు. చదరంగం, బాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ వంచి పోటీలను నిర్వహించారు. విజేతలుగా నిలిచిన వారిని సీపీ అభినందించారు.
ఇదీ చూడండి:అనారోగ్యంతో దేవినేని సీతారామయ్య కన్నుమూత