తెలంగాణ

telangana

ETV Bharat / state

గన్నేరువరంలో ట్రాక్టర్ల పంపిణీ చేసిన రసమయి... - TRACTORS DISTRIBUTION IN GANNERUVARAM BY RASAMAYI

పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా నిర్వహించేందుకే ప్రభుత్వం ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.

ట్రాక్టర్లు పంపిణీ చేసిన రసమయి
ట్రాక్టర్లు పంపిణీ చేసిన రసమయి

By

Published : Jan 6, 2020, 10:45 PM IST

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ఎంపీపీ లింగాల మల్లారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రసమయి హాజరయ్యారు. 11 గ్రామాలకు మంజూరైన ట్రాక్టర్లను పంపిణీ చేశారు. సమష్టి కృషితో ముందుకు సాగితేనే పల్లెలన్నీ ప్రగతి సాధిస్తాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మురుగు కాలువల నిర్వహణ, డంపింగ్ యార్డులు సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు సంయుక్తంగా చర్యలు తీసుకోవాలన్నారు.

హరిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి...

ప్రతీ గ్రామంలో స్మశానవాటికను ఏర్పాటు చేయాలని సర్పంచులకు సూచించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటుతూ హరిత గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. చిన్న గ్రామాలకు త్వరలోనే ట్రాక్టర్లను అందించడానికి కృషి చేస్తామన్నారు. మహిళా సంఘాల భవనాలను మహిళా దినోత్సవం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు మాడుగుల రవీందర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు, ఎంపీడీవో సురేందర్ రెడ్డి, తహసీల్దార్ రమేష్, సర్పంచ్​లు, ఎంపీటీసీలు, గ్రామ కార్యదర్శులు, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.

ట్రాక్టర్లు పంపిణీ చేసిన రసమయి

ఇవీ చూడండి : "ఆశ్రమ' ఉపాధ్యాయుడు నా బిడ్డను లైంగికంగా వేధిస్తున్నాడు"

ABOUT THE AUTHOR

...view details