తెలంగాణ

telangana

ETV Bharat / state

నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా... ట్రాక్టర్ల ర్యాలీ - వీణవంకలో ట్రాక్టర్లతో రైతుల ర్యాలీ

కరీంనగర్‌ జిల్లా వీణవంకలో రైతులు ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు. నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా... సుమారు 500 ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు.

నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా... ట్రాక్టర్ల ర్యాలీ
నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా... ట్రాక్టర్ల ర్యాలీ

By

Published : Sep 27, 2020, 10:10 AM IST

నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా... కరీంనగర్‌ జిల్లా వీణవంకలో రైతులు భారీ ట్రాక్టర్ల ప్రదర్శన చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి ఈటల రాజేందర్‌ జిందాబాద్‌ అంటూ తెరాస కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. రెడ్డిపల్లి నుంచి సుమారు 500 ట్రాక్టర్లతో వీణవంక మండల కేంద్రం వరకు ర్యాలీని చేపట్టారు.

నూతన చట్టంతో తమకు ఎంతో మేలని రైతులు పేర్కొన్నారు. తమ ఇబ్బందులన్నీ తొలగిపోయాయని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి ఈటల రాజేందర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

ఇదీ చూడండి: కులం కక్కుతున్న హాలాహలం.. ప్రేమ వివాహమే నేరమా?

ABOUT THE AUTHOR

...view details